తెలంగాణ ప్రొటోకాల్ ఉల్లంఘిస్తోంది.. ప్రధానికి జగన్ మరో లేఖ

by  |
cm-jagan,-pm-modi
X

దిశ, ఏపీ బ్యూరో : ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి మరో లేఖ రాశారు. కృష్ణాజలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై లేఖలో ఫిర్యాదు చేశారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. కేఆర్‌ఎంబీ పరిధిని తక్షణమే నోటిఫై చేసేలా కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు. శ్రీశైలంలో నీటిమట్టం పెరగకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోందని ఆరోపించారు. ఇలా తోడెయ్యడం వల్ల పోతిరెడ్డిపాడుకు సాగునీరు రాకుండా తెలంగాణ అడ్డుపడుతుందని విమర్శించారు. కేఆర్‌ఎంబీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతలలో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని జగన్ లేఖలో ఫిర్యాదు చేశారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు పరిష్కారం చూపాలని సీఎం జగన్ లేఖలో ప్రధాని మోడీని కోరారు.



Next Story

Most Viewed