ఏపీ కేబినెట్.. ఓకే చెప్పినవి ఇవే

by  |
ఏపీ కేబినెట్.. ఓకే చెప్పినవి ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ తోపాటు మంత్రులు పాల్గొన్నారు. సుమారు గంటకుపైగా ఈ సమావేశం కొనసాగింది. వచ్చే నెల ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్న జగనన్న విద్యాకానుక, వైఎస్సార్ ఆసరా పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సామాజిక భద్రత పథకం కింద వైఎస్సార్ బీమాపై కూడా చర్చించి ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి సంపూర్ణ పోషణ పథకం ప్రారంభం కానున్నది.

పంచాయతీరాజ్ శాఖలో 51 డివిజన్ డెవలెప్ మెంట్ లో అధికారుల పోస్టులకు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఏర్పాటైన ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్ నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా కడప జిల్లాలో పోలీస్ శాఖ బలోపేతానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాయచోటిలో సబ్ డివిజన్ ఏర్పాటుకు డీసీపీ స్థాయి అధికారి నియామకానికి, కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఓకే చెప్పింది. కడప జిల్లాకు 70 మంది అదనపు హోంగార్డుల కేటాయింపునకు కూడా ఓకే చెప్పింది.



Next Story

Most Viewed