ఎర్రకోటపై మోడీ ప్రసంగం.. పక్కనే యాంటీ డ్రోన్ సిస్టమ్

by  |
ఎర్రకోటపై మోడీ ప్రసంగం.. పక్కనే యాంటీ డ్రోన్ సిస్టమ్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ 74వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆ సమయంలో ఎలాంటి శత్రుదాడులు జరగకుండా యాంటీ డ్రోన్ వ్యవస్థను ఆర్మీ వర్గాలు ఏర్పాటుచేశాయి. అది ప్రత్యేక ఆకర్షరణగా నిలిచింది.

ఎర్రకోటపై జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న నేపథ్యంలో భద్రతాధికారులు దీన్ని ఏర్పాటు చేశారు. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థ దాదాపు 3 కిలోమీటర్ల వరకు నిఘా పెట్టగలదు. అతి సూక్ష్మ పరిమాణంలోని డ్రోన్లను కూడా పసిగట్టి నిమిషాల వ్యవధిలోనే నియంత్రించగలదు. లేజర్ ఆయుధం వాట్స్ పవర్‌ను బట్టి 1 నుంచి 2.5 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను ఛేదించగలదని డీఆర్డీవో ప్రకటించింది.



Next Story

Most Viewed