యాదాద్రి కలెక్టర్‌గా పనిచేయడం నా అదృష్టం : అనితా రామచంద్రన్

by  |
Anita-Ramachandran
X

దిశ, భువనగిరి: యాదాద్రి జిల్లా కలెక్టర్‌గా నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం పాటు పని చేయడం అదృష్టంగా భావించి.. సంతృప్తిగా వెళ్తున్నానని, బదిలీపై వెళ్తున్న కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. నూతన జిల్లా కలెక్టర్‌గా వచ్చిన పమేలా సత్పతికి సోమవారం బాధ్యతలు అప్పగించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా సుదీర్ఘకాలం పని చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎంతో సహకరించారని, అధికారుల తోడ్పాటు మరువలేనిదని ఆమె అన్నారు. తాను పనిచేసిన కాలంలో మల్కాపూర్ ఇండస్ట్రీయల్ పార్క్ అభివృద్ధి, బస్వాపూర్ నృర్సింహ జలాశయం, భునాదిగాని కాల్వ, ఎయిమ్స్, సీసీఎంబీ తదితర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు భూసేకరణ ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.

యాదాద్రి దేవాలయ పునర్:నిర్మాణ పనుల విషయంలో రింగ్ రోడ్డు పనులకు భూసేకరణ కోసం ఇల్లు కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపులో ఒప్పుకోనందున ఎంతో బాధపడ్డానని, చివరికి వారు ఒప్పుకున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చి అమలు చేశానని, పల్లె, పట్టణ ప్రగతి, జిల్లాలో ధాన్యం సేకరణ గణనీయంగా చేపట్టినట్లు తెలిపారు. సుమారుగా జిల్లాలో 15 వేల ఎకరాల భూ సేకరణ చేపట్టినట్లు తెలిపారు. బాధ్యతలతో ఒత్తిడి ఉన్నప్పటికీ ఒకే కుటుంబంలాగా కలిసి పనిచేసి జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఖీమ్యా నాయక్‌ పాల్గొన్నారు.

Next Story

Most Viewed