ఆండ్రాయిడ్ టీవీ యూజర్లు ఇది ‘ట్రై’ చేశారా?

by  |
ఆండ్రాయిడ్ టీవీ యూజర్లు ఇది ‘ట్రై’ చేశారా?
X

దిశ, వెబ్‌డెస్క్ :

స్మార్ట్ టీవీ వాడుతున్నారా? ఆండ్రాయిడ్ టీవీ వినియోగదారులా? అయితే గూగుల్ మీకోసం ఓ సరికొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. అదేంటంటే సాధారణంగా ఓ గేమ్ లేదా యాప్ గురించి ఎవరో చెప్పగానే వెంటనే దాన్ని డౌన్‌లోడ్ చేసేస్తుంటాం. తీరా డౌన్‌లోడ్ చేసి, ఆ గేమ్ లేదా యాప్‌ను వాడాక.. బాగాలేదని తెగ ఫీలై పోతాం, డేటా కూడా వేస్ట్ అయిపోతోంది. అందుకే సదరు యాప్ లేదా గేమ్‌ను డౌన్‌లోడ్ చేయకుండానే ఓసారి ట్రై చేస్తే? భలే ఉంటుంది కదా? ఇప్పుడు అదే కోవలో గూగుల్ ప్లే.. ఇన్‌స్టంట్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.

ఆండ్రాయిడ్ టీవీలో ఏవైనా యాప్స్ వాడాలంటే ఇకపై డౌన్‌లోడ్ చేయకుండానే యాప్స్, కొత్త గేమ్స్ ట్రై చేయొచ్చు. ఆ యాప్ లేదా గేమ్ ఎలా ఉందో టెస్ట్ చేసేందుకు ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడనుంది. గూగుల్ 2017లోనే ఈ ఫీచర్‌ను స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయకుండానే ట్రై చేయొచ్చు. ట్రై చేసిన తర్వాత ఆ యాప్ తమకు ఉపయోగపడుతుందని అనుకుంటేనే డౌన్‌లోడ్ చేయొచ్చు. కాగా, ఇప్పుడు ఇదే ఫీచర్‌ను ఆండ్రాయిడ్ టీవీ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది గూగుల్. యాప్ లేదా గేమ్ ఓపెన్ చేయగానే ఇన్‌స్టాల్ ఆప్షన్ పక్కన ఉండే ‘ట్రై నౌ’ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed