హమ్మయ్యా.. మా చిరకాల స్వప్నం నెరవేరింది

by  |
హమ్మయ్యా.. మా చిరకాల స్వప్నం నెరవేరింది
X

దిశ, ఆందోల్: జోగిపేట ప్రజల రెవెన్యూ డివిజన్ కల టిఆర్ఎస్ ప్రభుత్వం సాకారం చేసింది. అందోల్-జోగిపేటను కేంద్రబిందువుగా కొత్త రెవెన్యూ డివిజన్ గా గెజిట్ ఉత్తర్వులను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గెజిట్ ఉత్తర్వులను జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2018 నవంబర్ 28న జోగిపేటలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ లో సీఎం కేసీఆర్ జోగిపేట ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కొరకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు పై జోగిపేట ప్రాంత ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కొత్త మండలంగా చౌటకూర్:

అందోల్ నియోజకవర్గం పరిధిలోని పుల్కల్ మండలం లోని 14 గ్రామాలతో చౌటకూర్ ను కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోసాని పల్లి, శేరిరాం రెడ్డి గూడ, సుల్తాన్పూర్, సరాఫ్ పల్లి, కోర్పోల్, లింగంపల్లి, అంగడిపేట, తాడ్ దాన్ పల్లి, గంగోజీ పేట, చక్రియల్, చౌటకూర్, శివ్వంపేట, వెండికోల్, హున్నపూర్ గ్రామాలను కొత్త మండలం చౌటకూర్ పరిధిలోకి చేర్చారు.

నాలుగు మండలాలతో డివిజన్:

అందోల్ నియోజకవర్గంలోని ఆందోల్, పుల్కల్, వట్ పల్లి, చౌటకూర్ (కొత్త మండలం) మండలాలను కలుపుతూ కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం గతంలోనే ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసి ఈ డివిజన్ ఏర్పాటు కు లైన్ క్లియర్ చేసింది. దీంతో నాలుగు మండలాల పరిధిలోని 79 గ్రామాలు రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చాయి.

Next Story

Most Viewed