Kadapa: రెచ్చిపోయిన ఏనుగులు.. గుండెలు బాదుకుని రైతుల ఆవేదన

by srinivas |
Kadapa: రెచ్చిపోయిన ఏనుగులు.. గుండెలు బాదుకుని రైతుల ఆవేదన
X

దిశ, కడప: అన్నమయ్య జిల్లా బాలుపల్లి అటవీ రేంజ్ లక్ష్మీగార్డెన్ ఎస్టీ కాలనీ సమీపంలో ఏనుగులు హల్ చల్ చేశాయి. మామిడి, అరటి చెట్లను ధ్వంసం చేశాయి. మల్లెల పెంచలయ్య చీకటి చంద్రశేఖర్, వెంకటసుబ్బయ్యలకు చెందిన మామిడి, అరటి చెట్లపై ఏనుగులు దాడి చేశాయి. మామిడి కొమ్మలు విరిచి వేయడంతో కాయలన్నీ నేలరాలాయి. డ్రిప్ పరికరాలు ధ్వసం చేశాయి. పొలంలో అడుగులు, పేడ ఉండడంతో ఏనుగులు గుంపు వచ్చిందని నిర్ధారించుకుని అటవీశాఖ అధికారులకు బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. ఏనుగుల మంద దాడులకు తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed