APBRS: జగన్, చంద్రబాబుపై అసంతృప్తి.. ఏపీ బీఆర్ఎస్‌లోకి భారీగా నేతల చేరిక

by Disha Web Desk 16 |
APBRS: జగన్, చంద్రబాబుపై అసంతృప్తి.. ఏపీ బీఆర్ఎస్‌లోకి భారీగా నేతల చేరిక
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ వైసీపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధిపొందుతోందని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ ఏపీ బీఆర్‌ఎస్​క్యాంప్ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా చంద్రశేఖర్​మాట్లాడుతూ వైసీపీ ఎత్తుగడలను ప్రజలు అర్థం చేసుకొని తిప్పికొట్టాలన్నారు. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదని స్పష్టం చేశారు. అసత్య హామీలతో అధికారం చేపట్టిన సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమై ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై వైసీపీ నేతలు అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అసమర్ధ పాలనలో సామాన్యులు బతకలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నీ రంగాల్లో ముందుకు తీసుకెళుతున్న బీఆర్ఎస్​అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్ర ప్రాంత ప్రజలు కోరుకుంటున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. పార్టీ రాష్ట్ర నాయకులు తలారి సురేష్ అధ్వర్యంలో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు రామినేని సాయి చంద్ , కొప్పుల రాంబాబు సహా పలు జిల్లాలకు చెందిన నేతలు చంద్రశేఖర్ సమక్షంలో పార్టీలో చేరారు. వాళ్లందరికీ కండువాతో స్వాగతం పలికారు.



Next Story

Most Viewed