చంద్రబాబును కలిసిన YCP ఎంపీ.. ఢిల్లీలో సీఎం జగన్‌కు అనూహ్య షాక్!

by Disha Web Desk 19 |
చంద్రబాబును కలిసిన YCP ఎంపీ.. ఢిల్లీలో సీఎం జగన్‌కు అనూహ్య షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామరాజు ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల కోసం టీడీపీ ఎంపీలను రాజీనామా చేయించాలని ఒప్పించడానికే చంద్రబాబుతో భేటీ అయ్యాయని ఎంపీ రఘురామ క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల కోసం వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించి కేంద్రంపై ఒత్తిడి తెద్దామని సీఎం జగన్ చెప్పారని.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తాను రాజీనామాకు సిద్ధమని ఎంపీ రఘురామ స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలతో పాటు ప్రతిపక్ష టీడీపీ ఎంపీలను కూడా రాజీనామా చేయించాలని ఒప్పించడానికే టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయినట్లు ఎంపీ రఘురామ పేర్కొన్నారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రతిపక్ష పార్టీ అధినేతతో అధికార వైసీపీ ఎంపీ భేటీ కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక, సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే జీ-20 సన్నాహక సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇదే సమావేశం కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అయితే, ఢిల్లీలో సొంత పార్టీ అధినేతను కలవకుండా వైపీసీ ఎంపీ చంద్రబాబుతో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Next Story