రేవంత్ రెడ్డికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభినందనలు

by Seetharam |
రేవంత్ రెడ్డికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభినందనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రిగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అభినందనలు తెలియజేశారు. పార్లమెంటులో నా సహోద్యోగి అయిన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికవ్వడం సంతోషకరమన్నారు. జడ్పీటీసీ సభ్యుడి నుంచి సీఎం స్థాయికి రేవంత్ రెడ్డి ఎదిగారని కొనియడారు. ఎన్నికల ప్రచారంలో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చగలరని.. అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తీర్చగలరని మనసారా కోరుకుంటున్నట్లు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Advertisement

Next Story