రాళ్లతో కాదు నుదుటిని టార్గెట్ చేసి గన్‌తో జగన్‌పై దాడి.. YCP ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
రాళ్లతో కాదు నుదుటిని టార్గెట్ చేసి గన్‌తో జగన్‌పై దాడి.. YCP ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌పై జరిగిన దాడిపై రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై రాయితో దాడి జరుగలేదని అన్నారు. ఎయిర్‌గన్‌తో అటాక్ జరిగినట్లు అనుమానం ఉందని చెప్పారు. అటాకర్లు సీఎం నుదుటిని టార్గెట్ చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. పెల్లెట్ వచ్చి కంటిపైన తగిలినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సీఎం జగన్‌కు భద్రత తగ్గించారని అన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, జగన్‌పై దాడి జరగడంపై ఇతర రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. ఈ మేరకు ప్రధాని ఓ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ఆ ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌పై దాడి జరగడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఖండించారు.

Next Story

Most Viewed