లోకేశ్‌పై వైసీపీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి ఫైర్

by Disha Web Desk 7 |
లోకేశ్‌పై వైసీపీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ పాదయాత్రలో వలంటీర్లను కొనసాగిస్తామనడం సిగ్గుచేటు అని విమర్శించారు. వలంటరీ వ్యవస్థను రద్దు చేయాలని కోర్టుకు వెళ్ళి మళ్లీ ఇప్పుడు కొనసాగిస్తామంటున్నాడని ధ్వజమెత్తారు. సచివాలయ వ్యవస్థ వేస్ట్ అన్న టీడీపీ అగ్ర నాయకులు ఇప్పుడు కొనసాగిస్తామని అనడం వెనుక ఉద్దేశం ఏంటని నిలదీశారు.

సాధారణంగా ప్రతిపక్షాలు ప్రజల వద్దకు వెళ్తాయి కానీ అధికారపక్షంలో ఉండి కూడా జగనన్నే మా భవిష్యత్తు నమ్మకం కార్యక్రమంతో గడపగడపకు తిరుగుతున్నట్లు తెలిపారు. మైదుకూరు నియోజకవర్గంలో 84 వేల గృహాలు ఉంటే ఇప్పటికీ దాదాపు 60 వేల గడపలకు తిరిగాం అని స్పష్టం చేశారు. ప్రజలు నూటికి 99 శాతం సంక్షేమ పథకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఐదు కోట్ల కుటుంబాలకు గాను కోటి కుటుంబాలను కలిసినట్లు తెలిపారు.

లక్షల ఉద్యోగాలు జగన్ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. ఫలితంగా ప్రతి సచివాలయంలో 12 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. వలంటరీలకు రూ.5000 రూపాయల గౌరవ వేతనం ఇచ్చి వారి సేవలను వినియోగించుకుంటున్నామన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వలంటీర్లు వ్యవస్థ ద్వారా అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. నాగసాని పల్లెలో 2014 నుంచి 19 వరకు నాలుగు కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

వైఎస్ వివేకా హత్యకేసు.. అప్రూవర్‌ ఇంటికి సీబీఐ బృందం

Next Story

Most Viewed