టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న వైసీపీ మంత్రి.. ఆ సీటు నుంచే పోటీ!

by Disha Web Desk 5 |
టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న వైసీపీ మంత్రి.. ఆ సీటు నుంచే పోటీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో అధికార వైసీపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్ధులను మారుస్తూ వస్తొంది. ఈ అభ్యర్ధుల మార్పుల్లో భాగంగా కొందరికి టికెట్లు దక్కకపోగా, మరికొందరికి స్థాన చలనం కలిగింది. వీరిలో కొందరు పార్టీని వీడగా, మరికొందరు పక్క చూపులు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం త్వరలో టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తొంది. ఆయన గతంలో అలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా, వైసీపీ అధిష్టానం ఈ సారి అలూరు ఇన్ చార్జిగా విరూపాక్షను నియమించింది.

గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆదేశించింది. దీంతో అలూరును విడిచి వెళ్లడం ఇష్టం లేని జయరాం, పలుమార్లు సీఎం జగన్ తో, పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. అయినా ఫలితం లేకపోవడం పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల జరిగిన సిద్ధం సభకు హాజరుకాకపోవడం ఈ వార్తలకు బలం చేకూరినట్లు అయ్యింది. ఇక ఈ నెల 23వ తేదిన చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

ఇప్పటికే టీడీపీ నేతలతో చర్చలు కూడా జరిగాయని, అలూరు పక్కనే ఉన్న గుంతకల్లు సీటు ఆయనకు కేటాయించినట్లు సన్నిహితులు అనుకుంటున్నారు. మొదట టీడీపీ అధిష్టానం గుమ్మనూరు జయరాంను చేర్చుకునేందుకు సుముఖత చూపకపోగా.. కర్నాటక కాంగ్రెస్ నేతల జోక్యంతో ఓకే చెప్పినట్లు తెలిసింది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో గుమ్మనూరు జయరాం సోదరుడు, నాగేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన చొరవతో జయరాంకి సీటు కన్ఫామ్ అయినట్లు పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

Read more..

చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలన్న భువనేశ్వరి..మంత్రి జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed