జగన్ సభలో జర్నలిస్ట్‌పై దాడి.. ఒళ్లు కమిలేలా కొట్టిన వైసీపీ కార్యకర్తలు (వీడియో)

by Disha Web Desk 2 |
జగన్ సభలో జర్నలిస్ట్‌పై దాడి.. ఒళ్లు కమిలేలా కొట్టిన వైసీపీ కార్యకర్తలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఫొటో గాఫర్(జర్నలిస్టు)పై వైసీపీ కార్యర్తలు ఘోరంగా దాడి చేశారు. ఆదివారం అనంతపురం జిల్లాలోని రాప్తాడులో వైసీపీ నేతలు ‘సిద్ధం’ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రముఖ మీడియా దినపత్రిక ఫొటో గ్రాఫర్‌పై అధికార పార్టీ నేతలు కనికరం లేకుండా దాడి చేశారు. అయితే, ఈ సభ ప్రారంభం అయ్యాక.. సభలో ఖాళీగా ఉన్న కుర్చీలను ఫొటోలు తీస్తున్నాడని.. ఈ సభకు జనం చాలా తక్కువగా వచ్చారనే మెసేజ్ ప్రజలకు వెళ్తుందని ఆగ్రహం వ్యక్తం చేసిన వారు.. ఫొటోలు తీయొద్దని చెబుతూనే దాడి చేశారు.

అనంతరం రాప్తాడు పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. తాజాగా.. ఈ ఘటనను తెలంగాణ ఫొటో జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఫొటో గ్రాఫర్‌పై దాడి చేయడం కరెక్ట్ కాదని అన్నారు. వృత్తి ధర్మంలో భాగంగా రాజకీయ బహిరంగ సభలలో పాల్గొంటారని.. వారి వృత్తి వారు నిర్వర్తిస్తున్న సమయంలో అడ్డుతగలడమే కాకుండా తీవ్రంగా దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అనుమల్ల గంగాధర్, కేఎన్ హరి ప్రకటించారు. వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి : https://www.youtube.com/watch?v=TwVYaCIJc3M

Next Story

Most Viewed