నామినేషన్ వేసిన కాసేపటికే టీడీపీ అభ్యర్థి పై కేసు నమోదు..కారణం ఏంటంటే?

by Disha Web Desk 18 |
నామినేషన్ వేసిన కాసేపటికే టీడీపీ అభ్యర్థి పై కేసు నమోదు..కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నికలకు సమయం తక్కువ ఉండడంతో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. గురువారం నుంచి నామినేషన్ల దాఖలు చేసే పనిలో అన్ని పార్టీల అభ్యర్థులు బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీచేసేందుకు టికెట్ కోసం వెయిట్ చేసిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసి ఓటర్ల మనసును దోచుకునే పనిలో పడ్డారు. దీంతో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒక పార్టీ పై మరో పార్టీ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి వింత అనుభవం ఎదురైంది.

అది ఏంటంటే..పుట్టపర్తి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధూర రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అతని పై సర్వేల్లో వ్యతిరేక ఫలితాలు రావడంతో ఈసారి ఆయన కోడలికి టీడీపీ అధిష్టానం ఛాన్స్ ఇచ్చిందనే వార్తలు వినిపించాయి. శుక్రవారం పుట్టపర్తిలోని RO కార్యాలయంలో ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయితే నామినేషన్ వేసిన తర్వాత ఆర్వో కార్యాలయం వద్ద సింధూర రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం రోడ్ షో నిర్వహించారు. దీనిపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఫిర్యాదు మేరకు పల్లె సింధూర రెడ్డి మీద కేసు నమోదైంది.

Next Story

Most Viewed