Bhimavaram: రేవంత్ రెడ్డి వియ్యంకుడి ఇంటి వద్ద సంబరాలు

by Disha Web Desk 16 |
Bhimavaram: రేవంత్ రెడ్డి వియ్యంకుడి ఇంటి వద్ద సంబరాలు
X

దిశ, భీమవరం: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమార్తె నైమిష రెడ్డి, అల్లుడు సత్యనారాయణ రెడ్డి భీమవరంలోని ఇంటి వద్ద సంబరాలు జరుపుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీవాసులు రేవంత్ రెడ్డి వియ్యంకుడు వెంకటరెడ్డి ఇంటి వద్దకు చేరుకుని బాణాసంచా కాల్చి సీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. అందరితో స్నేహంగా మాట్లాడే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని దేవాలయాల్లో పూజలు జరిపినట్లు వారు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి పేరు ప్రకటించగానే భీమవరంలో సంబరాలు చేసుకున్నారు.

భీమవరం రేవంత్‌ రెడ్డి వియ్యంకుడి ఊరు. భీమవరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గొలుగూరి వెంకటరెడ్డి కుమారుడు సత్యనారాయణ రెడ్డికి రేవంత్‌ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డిని ఇచ్చి 2015లో వివాహం చేశారు. భీమవరం ప్రాంతానికి చెందిన పలువురితో రేవంత్‌ రెడ్డికి పరిచయాలు ఉన్నాయి. స్నేహితుల ఆహ్వానం మేరకు ఆయన ఒకసారి సంక్రాంతి వేడుకలు చూసేందుకు భీమవరం వెళ్లారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగానే ఈ నెల 3న భీమవరంలో పెద్ద సంఖ్యలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. భీమవరం హౌసింగ్‌ బోర్డు కాలనీలో వెంకటరెడ్డి నివాసం వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే సంతోషంతో స్వీట్లు పంచారు.



Next Story

Most Viewed