Visakha: మంత్రుల ఉత్తరాంధ్ర ఉక్కు గర్జన ఏమైంది?

by Disha Web Desk 16 |
Visakha: మంత్రుల ఉత్తరాంధ్ర ఉక్కు గర్జన ఏమైంది?
X
  • కేంద్రానికి సహకరిస్తూ ఉత్తుత్తి గర్జనలు ఎందుకు?
  • ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ జేఏసీ కన్వీనర్ ప్రియాంక దండి ఆగ్రహం

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖలో అధికార పార్టీ మంత్రుల ఉత్తరాంధ్ర ఉక్కు గర్జన ఫలితం ఏమైందని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ జేఏసీ కన్వీనర్ ప్రియాంక దండి ప్రశ్నించారు. విశాఖ మద్దిలపాలెంలో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రానికి సహకరిస్తూ ఉత్తుత్తి గర్జనలు ఎందుకు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా డిమాండ్లు సాధించలేని నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు పదవులు కేవలం అలంకారప్రాయంగా మాత్రమే ఉన్నాయని, అధికారం ఉన్నా పని చేయలేని నిస్సహాయత ప్రజలకు అవసరం లేదని ప్రియాంక వ్యాఖ్యానించారు. కుల, మతాలను రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఉపయోగించుకుంటున్నాయని.. వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

Next Story