Visakha: చేపల వేట బంద్‌.. మత్స్యకారులకు సాయమేది?..

by Disha Web Desk 16 |
Visakha: చేపల వేట బంద్‌.. మత్స్యకారులకు సాయమేది?..
X

దిశ, ఉత్తరాంధ్ర: గంగపుత్రుల జీవనాధారమైన చేపల వేట బంద్ అయింది. ఏటా వేసవి సమయంలో ఏప్రిల్‌ మే నెల మధ్య చేపల వేట నిషేధం అమల్లోకి వస్తుంది. 45 రోజుల పాటు చేపల వేటకు విరామం ప్రకటించడంతో తమ బోట్లను జెట్టీలోనే ఉంచేసి మత్స్యకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. గంగపుత్రులు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. అప్పటికే భద్రం చేసుకున్న చేపల్ని మహిళలు విక్రయించుకుంటారు. అయితే ఈ 45 రోజులకు సరిపడా ఆహారం, నిత్యవసర సరుకులు సంపాదించుకునేందుకు కష్టతరంగా ఉండడంతో ప్రభుత్వం కూడా ఏటా మత్స్యకార భరోసా పేరిట సంక్షేమ పథకాన్ని అమలు చేస్తోంది. విశాఖ పరిధిలో సుమారు 27కి.మీ మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. ఫిషింగ్‌ హార్బర్‌ సహా భీమిలి, వాల్తేరు ప్రాంతాల్లో మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు..



Next Story