AP News:వైసీపీ ప్రభుత్వం తోనే ప్రజా సంక్షేమం:ఎమ్మెల్యే అభ్యర్థి

by Disha Web Desk 18 |
AP News:వైసీపీ ప్రభుత్వం తోనే ప్రజా సంక్షేమం:ఎమ్మెల్యే అభ్యర్థి
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వైసీపీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా మద్దతు కోరాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం విడుదల చేసిన మేనిఫెస్టోకు సంబంధించి ఆదివారం నియోజకవర్గం పరిధిలోని 14 వార్డుల కార్పొరేటర్, వార్డు అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ ఏజెంట్లు, ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయం కీలకమని, దీనిపై అందరూ దృష్టి సారించాలని అన్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు పరిచిన విషయాన్ని ప్రజలకు వివరిస్తూ, గతం కంటే మరిన్ని పథకాలతో విడుదల చేసిన 2024 ఎన్నికల మేనిఫెస్టో హామీలు గురించి ప్రజలకు తెలియజేయాలని కోరారు.

ఇచ్చిన హామీలన్నీ అమలు పరిచే ప్రభుత్వం ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమే అని అన్నారు. ఎన్నికల సమయం బాగా దగ్గరవుతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని, వైసీపీ గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయాలంటే, కార్యకర్తలు, నేతల సహకారం అవసరమని, దీనికి ప్రజా మద్దతు కోరాలని తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాలు అమలవ్వాలంటే ప్రజా ప్రభుత్వం అయిన వైసీపీ అధికారంలోకి రావాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ప్రజా సంక్షేమం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలులో పైసా అవినీతి లేకుండా అమలు జరిపిన విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎన్నికల పరిశీలకులు ఏ ఆర్ రెహ్మాన్, మహిళా విభాగం నేత పేడాడ రమణి కుమారి, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed