విశాఖలో సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

by Disha Web Desk 18 |
విశాఖలో సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
X

దిశ, ప్రతినిధి: విశాఖలో మంగళవారం జరిగే పలు కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం తో కలిసి ఏపీ ప్రభుత్వ సలహాదారుడు (స్కిల్ ట్రైనింగ్ & జాబ్ ఫెయిర్) గాది శ్రీధర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. పి.ఎం పాలెం లో ది క్యాస్కేడింగ్ స్కిల్ పారాడిగం భవిత, రాడిసన్ బ్లూ లో జరిగే డెవలప్మెంట్ డైలాగ్ అన్ విల్లింగ్ ఆఫ్ విజన్ విశాఖ కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించి ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ ఎండీ & సి.ఈ.వో డాక్టర్ వి.వినోద్ కుమార్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సి.నాగరాణి, ఈడి దినేష్ కుమార్, సీడాప్ సి.ఈ.వో ఎం.కె.వి శ్రీనివాసులు స్టేట్ మిషన్ మేనేజర్, డి.ఎస్.డి వోలు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed