మహా సరస్వతి అలంకారంలో అమ్మవారు

by Dishafeatures2 |
మహా సరస్వతి అలంకారంలో అమ్మవారు
X

దిశ, శ్రీశైలం : శ్రీశైలం మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన మంగళవారం అమ్మవారు మహా సరస్వతి అలంకారంలో దర్శనమిచ్చారు. నందివాహన సేవపై భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జున స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి ఉత్సవమూర్తులకు అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం అశేష భక్త జనం మద్య శ్రీశైలం పురవీధులలో గ్రామోత్సవానికి స్వామిఅమ్మవార్లు నందివాహన సేవపై వైభవంగా భయలుదేరగా హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు భక్తి భావంతో శివనామ స్మరణతో శ్రీశైలం ఆలయం మారు మ్రోగింది.

ఆలయం నుంచి ఉత్సవమూర్తుల గ్రామోత్సవం సాగుతుండగా ఉత్సవం ముందు మంగళ వాయిద్యాలు డమరుకాలు పిల్లన గ్రోవులతొ నాట్యాలు కోలాటలు లంబాడిల ఆటపాటలు భక్తులను కనువిందు చేశాయి బ్యాండ్ వాయిద్యాలతో విద్యుత్ ద్వీపకాంతుల నడుమ వేలాది మంది కన్నడ భక్తజనం మద్య శ్రీశైలం పురవీధులలో గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఉన్న స్వామిఅమ్మవార్లను కన్నడ భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు.



Next Story

Most Viewed