నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

by Disha Web Desk 10 |
నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
X

దిశ,వెబ్ డెస్క్: 2014 జూన్ 2న రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం సంప్రదాయంగా వస్తున్న అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికి , ఆంధ్రరాష్ట్ర అవతరణ అయిన అక్టోబర్ 1న జరుపుకోవాలనే ఒక వాదన ఉన్నప్పటికినీ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన నవంబర్ 1న మాత్రమే అవతరణ దినోత్సవాన్ని జరపాలని ప్రస్తుత వై యస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించి పాత సాంప్రదాయాన్నే పాటిస్తుంది.

ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను బుధవారం ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఉదయం 10:15 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే వేడుకల్లో సీఎం జగన్‌ పాల్గొంటారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అలాగే, తెలుగుతల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం వైఎస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానం జరగనుంది.



Next Story

Most Viewed