AP political News: డ్వాక్రా మహిళలకు శుభవార్త.. నేడు ఖాతాలోకి నగదు జమ

by Disha Web Desk 3 |
AP political News: డ్వాక్రా మహిళలకు శుభవార్త.. నేడు ఖాతాలోకి నగదు జమ
X

దిశ వెబ్ డెస్క్: వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్టంలో లోని డ్వాక్రామహిళలకు శుభవార్త చెప్పారు. ఈ రోజు డ్వాక్రా మహిళల ఖాతాలోకి నగదు జామకానుంది. వివరాల్లోకి వెళ్తే.. 2019 ఎన్నికల సమయానికి డ్వాక్రా మహిళలకు బ్యాంకు లో ఉన్న అప్పును అధికారం లోకి రాగానే తీరుస్తానని వైఎస్ జగ్మోహన్ రెడ్డి తెలిపారు. అయితే అనుకున్నట్టుగానే భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ అధికారం లోకి వచ్చేసరికి డ్వాక్రా మహిళల పేరుతో బ్యాంకు లో రూ.25,570.80 కోట్ల అప్పు ఉంది. కాగా ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నిధులు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం పూనుకుంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే నాలుగు విడతల్లో నిధులు విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం రూ.19,175.97 కోట్లు చెల్లించింది. ఇక 78 లక్షల మందికి గాను రూ/ 6394.83 కోట్ల అప్పు బ్యాంకు లో ఉంది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5వ విడతగా మిగిలిన అప్పు అంటే రూ/ 6394.83 కోట్లను డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతా లోకి జమ చేయనున్నారు. కాగా ఈ రోజు ఉరవకొండలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. అనంతరం ఉరవకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు.



Next Story

Most Viewed