Tirumala Samacharam: కిక్కిరిసిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌.. ఏకంగా రోడ్ల మీదకు బారులు తీరిన భక్తులు

by Disha Web Desk 1 |
Tirumala Samacharam: కిక్కిరిసిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌.. ఏకంగా రోడ్ల మీదకు బారులు తీరిన భక్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: వీకెండ్ దగ్గరపడటంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దర్శనం కోసం వేచిచూసే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులతో కిక్కిరిసిపోయింది. దీంతో ఇవాళ ఏకంగా రోడ్లపైనే భక్తులు బారులు తీరారు. అదేవిధంగా పోరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుండటంతో వసతి గృహాలు కూడా కరువయ్యాయి. ఎవరైతే ముందు జాగ్రత్తతో బుక్ చేసుకున్న వారికి మాత్రమే రూంలు దొరుకుతున్నాయి. మరోవైపు రూ.300 ప్రత్యేక దర్శన టోకెన్లు తీసుకున్న భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 4 నుంచి 5 గంటల వరకు సయయం పడుతోంది.

అదేవిధంగా జూలై మాసానికి సంబంధించిన టికెట్లను ఈ నెల 18న నుంచి ఆన్‌లైన్‌లో అధికారులు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం స్వామి వారి సర్వదర్శనానికి వచ్చిన సాధారణ భక్తులకు 19 గంటల సమయం పడుతోంది. కాగా, నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారిని 48,444 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 23,266 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.71 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Read More..

ఉగాది నాడు అరుదైన శుభయోగాలు.. ఆ రాశుల వారికి లక్ష్మిదేవి కటాక్షం..


Next Story

Most Viewed