Coromandel express accident : ఒడిశా రైలు ప్రమాదం.. రెండు రైళ్లలోను ఏపీ ప్రయాణికులు

by Disha Web Desk 12 |
Coromandel express accident : ఒడిశా రైలు ప్రమాదం.. రెండు రైళ్లలోను ఏపీ ప్రయాణికులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలో ప్రమాదానికి గురైన రెండు రైళ్లలోనూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రయాణికులు ఉన్నారని అధికారవర్గాల సమాచారం. రిజర్వేషన్ వివరాల ఆధారంగా రాష్ట్రంలోని వివిధ స్టేషన్లలో ఎక్కిన, దిగాల్సిన ప్రయాణికులు రెండు రైళ్లలో కలిపి 122 మంది ఉన్నారు. ఇందులో కొంతమంది క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం అందించారు. అయితే, చాలా మంది ప్రయాణికుల వివరాలు మాత్రం తెలియరాలేదు. వారి ఫోన్లు కలవడం లేదని కొంతమంది, స్విచ్ఛాప్ అని వస్తోందని మరికొంతమంది చెప్పారు. దీంతో తమ వారికి ఏం జరిగిందోనని వారంతా ఆందోళన చెందుతున్నారు.

యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళుతున్న హౌరా ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతిలో 12 మంది, చీరాలలో 12 మంది, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, బాపట్ల స్టేషన్‌లో ఇద్దరేసి చొప్పున, బెజవాడలో నలుగురు, రేణిగుంటలో 8 మంది ప్రయాణికులు ఎక్కారని రైల్వే అధికారులు వెల్లడించారు. మొత్తంగా హౌరా ఎక్స్‌ప్రెస్‌‌లో 52 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నారు. షాలిమార్ నుంచి చెన్నై వస్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో సుమారు 70 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో 47 మంది, రాజమహేంద్రవరంలో 24 మంది, ఏలూరులో ఒకరు.. మొత్తం 70 మంది ప్రయాణికులు ఏపీలో దిగాల్సి ఉంది. కాగా, రాజమహేంద్రవరంలో దిగాల్సిన 21 మంది ప్రయాణికులు సేఫ్‌గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగతా ప్రయాణికుల ఆచూకీ గురించి ప్రయత్నిస్తున్నారు.

Read more:

ఒడిషా రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం: CM మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed