కలగానే మిగిలిన కండలేరు లింక్ కెనాల్.. అమలుకాని హామీలు.. ప్రజల ఆవేదన

by Disha Web Desk 3 |
కలగానే మిగిలిన కండలేరు లింక్ కెనాల్.. అమలుకాని హామీలు.. ప్రజల ఆవేదన
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రేదేశ్ లో 2019 ఎన్నికలకు ముందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే పాదయాత్రలో భాగంగా నెల్లూరులోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఇక ఆ పర్యటనలో తాను అధికారంలోకి వస్తే అది చేస్తా ఇది చేస్తా అంటూ పలు హామీలు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందేముఖ్యంగా పొదలకూరు, గూడూరులో రైతులు ఎక్కువగా నిమ్మ సాగు చేస్తారు. అయితే పండించిన పంటను విక్రయించేందుకు జిల్లాలో సరైన మార్కెట్ లేదు.

ఉన్న మార్కెట్లన్నీ ప్రైవేట్ మార్కెట్లే. దీనితో రైతులు తక్కువధరకే పంటను విక్రయించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో తాను అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఆధ్వర్యంలో పంటను అమ్ముకునేలా మార్కెట్ ను ఏర్పాటు చేస్తామని.. అలానే కోల్డ్ స్టోరేజ్ లు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలానే కండలేరు నుండి గొట్లపాలెం వరకు కండలేరు లింక్ కెనాల్ నిర్మించి ఆయకట్టు ఆఖరి గ్రామాలకు సాగు నీరు అందిస్తానని కూడా హామీ ఇచ్చారు. ఐదేళ్లు ఏడుస్తున్నా కండలేరు లింక్ కెనాల్ కలగానే మిగిలిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన కాలువ పనులను కూడా వైసీపీ అధికారంలోకి రాగానే ఆపేసింది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై సింహపురి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొదలకూరు మీదుగా పాదయాత్ర చేస్తూ తాను పదవిలోకి రాగానే ప్రభుత్వం తరుపున పంటను విక్రయించుకునేలా మార్కెట్ ను ఏర్పాటు చేస్తానని చెప్పిన జగన్ ఐదేళ్లు పూర్తవుతున్న నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో గెలిపించండి మండలానికి ఓ కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తామని.. అలానే ఊరగాయ ఫ్యాక్టరీలు కూడా నిర్మిస్తామని అప్పటి పాదయాత్రలో చెప్పిన జగన్, మళ్ళీ ఎన్నికలు వస్తున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా నిమ్మ రైతులను మోసం చేశారని మండిపడ్డారు.

Read More..

BREAKING: ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. నేడు చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కనున్న రఘురామకృష్ణరాజు

Next Story

Most Viewed