పంతంగి చెక్ పోస్టు వద్ద బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ అరెస్టు

by Disha Web Desk 15 |
పంతంగి చెక్ పోస్టు వద్ద బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ అరెస్టు
X

దిశ, సికింద్రాబాద్ : ఓయూ హాస్టళ్ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ పోస్టింగులు పెట్టి దుష్ప్రచారం చేసిన కేసులో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి మన్నె క్రిషాంక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిషాంక్ కొత్తగూడెం నుండి హైదరాబాద్ వైపు వస్తుండగా పంతంగి టోల్గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది జారీచేసిన సర్క్యూలర్ కు బదులుగా ఫేక్ సర్క్యూలర్ ను తయారుచేసి సోషల్ మీడీయాలో పోస్టు చేసి ఓయూ ప్రతిష్టను దెబ్బ తీసేలా న్యూస్​ స్ప్రెడ్​ చేసినందుకు క్రిషాంక్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సర్క్యూలర్ పై నంబరు కూడా పెన్నుతో రాశారని,

తన సంతకాన్ని సైతం కాపీ చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఓయూ చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ రావు తెలిపారు. వార్డెన్ ఫిర్యాదు మేరకు క్రిషాంక్ పై కేసునమోదు చేసిన ఓయూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే క్రిషాంక్ పై ఓయూ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసుతో పాటు మరో నాలుగు కేసులు కూడా ఉన్నట్లు , ఈ కేసులపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఓయూ సెలవుల సర్క్యూలర్ వివాదంలో ఆరోపణ ఎదుర్కొంటున్న మరో వ్యక్తి ఓయూ పూర్వ విద్యార్థి నాగేందర్ తో కలిసి సిటీలో కేటీఆర్ నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ కు హాజరయ్యేందుకు గాను కొత్త గూడెం నుంచి హైదరాబాద్ కు వస్తుండగా పంతంగి చెక్ పోస్టు వద్ద క్రిశాంక్ కారును ఆపిన పోలీసులు నాగేందర్ ను గుర్తుపట్టక పోవడంతో క్రిశాంక్ ను మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి చౌటుప్పల్ పోలీసుస్టేషన్ కు తరలించి, తిరిగి అక్కటి నుండి ఓయూ పోలీసు స్టేషన్ కు తరలించినట్టు సమాచారం.

Next Story