రాజధాని రగడ..! ఎన్నికల ముందు తెరపైకి ఏపీ రాజధాని ఇష్యూ

by Disha Web Desk 14 |
రాజధాని రగడ..! ఎన్నికల ముందు తెరపైకి ఏపీ రాజధాని ఇష్యూ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ రాజకీయాలు ప్రస్తుతం ‘రాజధాని’ చుట్టూ తిరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాజాధాని అమరావతి తీసేసి మార్చుతామని చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. ఏపీకి మూడు రాజధానులు ఉండాలనే ప్రతిపాదనలు గతంలో సీఎం జగన్ తెచ్చారు. దీనికి ప్రతిపక్షాలు మాత్రం ఒప్పుకోలేదు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ప్రతిపాదించిన అమరావతి మాత్రమే ఏపీకి రాజధాని ఉండాలని పట్టుబట్టారు. దీంతో ఈ వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. ఇటీవల సుప్రీం కోర్టులో ఏపీ రాజధాని కేసు విచారణ జరిగింది. రాజధాని కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ క్రమంలోనే ఎప్రిల్‌కు సుప్రీం కోర్టు విచారణ వాయిదా వేసింది. ఈ లోగా అన్ని పక్షాలు తమ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

ఎన్నికలు జరగబోయే ముందు

తాజాగా సార్వత్రిక ఎన్నికలు జరగబోయే ముందు ఏపీ రాజధాని ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. ఒకవైపు వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలు ప్రచారం స్పీడ్ పెంచాయి. అయితే ఒక్కసారిగా రాజధాని అంశం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ అభివృద్ధి కోసమే మూడు రాజధానులు అని చెప్పారు. దీనికి అందరూ వైసీపీ నేతలు గతంలో మూడు రాజధానులకు ఏకీభవించారు.

వైసీపీ నాయకుల మాటల్లో తేడా..!

తాజాగా వైసీపీ నాయకుల మాటల్లో తేడా కన్పిస్తుందని, అయితే పరిస్థితిని బట్టి వైసీపీ నాయకులు రాజధాని విషయంలో మాట్లాడుతారని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని.. ఆ తర్వాతే మూడు రాజధానులని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజధాని ఏమైనా అన్నం పెడుతుందా..? అని బియ్యపు మధు సుధన్ రెడ్డి వెటకారంగా మాట్లాడారు. హైదరాబాద్ తెలంగాణ, ఏపీకి ఉమ్మడి రాజధానిగా కొనసాగాలని వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు. ఏపీకి ఉమ్మడి రాజధాని మంచిందేనని మంత్రి పెద్దిరెడ్డి తాజాగా వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ నాయకుల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల వేళ వీరి వ్యాఖ్యల వెనుక మర్మమేమిటి? చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో వైసీపీ గెలిచేందుకు ఈ అంశం తెరపైకి తెచ్చిందని టాక్ నడుస్తోంది. ఎన్నికల ముందు ఈ అంశం తెరపైకి రావడం వైసీపీకి లాభమా? లేక టీడీపీ, జనసేన పార్టీలకు లాభమా? వేచి చూడాలి.

Next Story