వైసీపీ సర్కారు నాలుగేళ్ల పాలన తీరిదే !

by Prasanna |
వైసీపీ సర్కారు నాలుగేళ్ల పాలన తీరిదే !
X

దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రిగా జగన్​ ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాల అమలుకు పూనుకున్నారు. ఈ రత్నాల ద్వారానే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని బలంగా విశ్వసించారు. అందుబాటులో ఉన్న నిధులను దేనికెంత వెచ్చించాలనే సమన్వయాన్ని గాలికొదిలేశారు. నవరత్నాల అమలు తప్ప ప్రభుత్వం మరేదీ పట్టించుకోలేదు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే కొవిడ్​ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని వల్ల సుమారు రూ. 20 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు ప్రభుత్వం చెప్పింది. మరోవైపు కొవిడ్​ను ఎదుర్కోవడానికి మరో రూ.20 వేల కోట్లను వెచ్చించాల్సి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

నవరత్నాలు... సర్వరోగనివారణా?

వాస్తవానికి ప్రభుత్వం నష్టపోయిన దానికి పది రెట్లు ప్రజలు నష్టపోయారు. ఉద్యోగాలు ఊడిపోయాయి. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. చిరు వ్యాపారులు గుల్లయిపోయారు. చిరుద్యోగులు నేటికీ కోలుకోలేకపోతున్నారు. కొవిడ్​ బారినపడిన కుటుంబాలైతే కొంపాగోడు తెగనమ్ముకొని రోడ్డున పడాల్సి వచ్చింది. ఇలాంటి విపత్కర స్థితిలో ప్రభుత్వం తమ విధానాలను పున:సమీక్షించుకొని ముందుకు వెళ్లాల్సింది. దీనికి బదులు నవరత్నాలే అన్నింటికీ పరిష్కారమన్నట్లు వ్యవహరించింది. పేదలకు ఏదో కేంద్రం ఇచ్చిన వెయ్యి రూపాయల నగదు, బియ్యం, పప్పు ఉప్పుతో సరిపెట్టింది. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లను ఆదుకోవడానికి ఎలాంటి పరిష్కారం చూపలేదు. దెబ్బతిన్న చిరు వ్యాపారాలను గాడిలో పెట్టేందుకు దృష్టి పెట్టలేదు. మూతపడిన పరిశ్రమలను తెరిపించడం, ఉపాధి అవకాశాలు పెంపొందించడంపై కేంద్రీకరించలేదు.

దాగుడుమూతలు..

కొవిడ్​ రిలీఫ్​ కింద కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ మొత్తం కూడా బ్యాంకుల వద్ద నగదు నిల్వలు పెంచడానికి కొంత దోహదపడింది. పరిశ్రమాధిపతులు తమ వద్ద పేరుకుపోయిన ఉత్పత్తులను మార్కెట్​లో డంప్​ చేయడానికి పనికొచ్చింది. ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు ఒక్క రూపాయి వెచ్చించలేదు. నవరత్నాల కింద రాష్ట్ర ప్రభుత్వ అమలు చేసిన నగదు బదిలీ పథకాలు సగటు ప్రజల నిత్యావసరాల కొనుగోలుకే పరిమితమయ్యాయి. మార్కెట్​ కుప్పకూలకుండా తమ డీబీటీ పథకాలు నిలబెట్టాయని రాష్ట్ర సర్కారు గొప్పగా చెప్పుకుంది. అదే కొవిడ్​ సమయంలోనే పెట్రోలు, డీజిల్​ ధరలపై ఎక్సైజ్​ సుంకాన్ని పెంచి 50 శాతం ధరలు పెంచారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చములు ధరలు పడిపోయినా ఇక్కడ ధరలు పెంచేసి ప్రజలను నిలువు దోపిడీ చేశారు. కేంద్రం పెంచితే మాకేం సంబంధమని రాష్ట్ర సర్కారు బుకాయిస్తోంది. రాష్ట్ర పన్నులతోపాటు కేంద్రం వసూలు చేసే దాంట్లో 40 శాతం రాష్ట్రానికే ఇస్తుందన్న వాస్తవాన్ని ప్రజలకు చెప్పడం లేదు.

దాదాపు అందరూ రుణాల ఊబిలోనే..

వరుసగా రెండేళ్లపాటు కొవిడ్​ సమస్య సగటు ప్రజలను పీల్చి పిప్పి చేసింది. ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేదు. ఉపాధి లేదు. కొత్త ఉద్యోగాల్లేవు. కొత్త పరిశ్రమలు రాలేదు. మూతపడినవి పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. ఇలాంటి సమయంలోనైనా ప్రభుత్వ నిర్ణయాలను మార్చుకోలేదు. ఇంకా రత్నాల అమలు బాటలోనే ముందుకు సాగారు. అక్కడ నుంచి విద్యుత్​, రవాణా చార్జీలు పెరిగాయి. నిత్యావసరాలపై జీఎస్టీ పన్నులు వేశారు. మద్యం ధరలు రెట్టింపు చేశారు. మొత్తంగా జనం మూలిగలు పీల్చేదానికే ప్రాధాన్యమిచ్చారు. దీంతో సాధారణ కుటుంబ ఆదాయం పాతాళంలోకి పోతే వ్యయం తాటిచెట్టులా పెరిగింది. నాలుగేళ్ల క్రితం నాటి జీవన వ్యయంతో పోల్చితే నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెరిగింది. అనివార్యంగా ప్రజలంతా అప్పుల ఊబిలోకి జారిపోయారు. దేశంలోనే

అత్యధికంగా రాష్ట్రంలో 93.5...

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు, అరెస్టు కాకుండా ఉండేందుకు కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే ఉన్నాయి. తాజాగా ఆయనకు సుప్రీం కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషనుపై విచారణ చేపట్టిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నరసింహ కీలక ఆదేశాలు జారీ చేశారు. అవినాశ్ కోరినట్లు ఈ నెల 25 వరకు రిలీఫ్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అంగీకరించలేదు. 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ కు వెళ్లాలని సూచించింది. అదే రోజు విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. సుప్రీం కోర్టులో ఉపశమనం లభిస్తుందని ఆశపడిన అవినాశ్ రెడ్డికి అడియాసే ఎదురైంది.

ఇవి కూడా చదవండి:

రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది.. Nara Lokesh

తెలుగుదేశం మళ్లీ వెలిగేనా?

Next Story

Most Viewed