విజృంభిస్తున్న కరోనా.. ఏకలవ్య పాఠశాలలో 14 మందికి..

by Disha Web Desk 4 |
విజృంభిస్తున్న కరోనా.. ఏకలవ్య పాఠశాలలో 14 మందికి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. మక్కువ మండలంలోని ఏకలవ్య పాఠశాలలో 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిని అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే నిన్న ఐటీడీఏ పీవో పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్థులు అస్వస్థతతో ఉండటాన్ని గుర్తించారు. వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. తాజాగా మరికొంత మందికి పరీక్షలు చేయగా 14 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు గుర్తించారు. అయితే విద్యార్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

Next Story