టెన్త్ పరీక్షకు వెళ్లొచ్చి విద్యార్థిని మృతి.. కారణం ఇదేనంటూ కుటుంబ సభ్యుల రోదన

by Disha Web Desk |
టెన్త్ పరీక్షకు వెళ్లొచ్చి విద్యార్థిని మృతి.. కారణం ఇదేనంటూ కుటుంబ సభ్యుల రోదన
X

దిశ, వెబ్‌డెస్క్: అధిక ఒత్తిడి విద్యార్థుల ప్రాణాలను తీస్తోంది. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావడం, మానసిక ఆందోళన చెందుతుండటంతో చిరుప్రాయంలోనే హార్ట్ స్ట్రోక్‌లు సంభవించి టీనేజ్‌లోనే విద్యార్థులు ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో ఓ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. గుడ్లవల్లేరు మండలం నాగవరానికి చెందిన విద్యార్థిని చిన్నారి (15) స్థానిక హైస్కూల్లో 10వ తరగతి చదువుతుంది. ఆమె బృగుబండలో టెన్త్ పరీక్షలు రాస్తోంది. ఇవాళ ఉదయం యథావిధిగా పరీక్షకు హాజరైన చిన్నారి.. ఇంటికి రాగానే అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను సత్తెనపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచింది. కాగా, చిన్నారి కొన్నాళ్లుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నదని, ఆ కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు.


Next Story

Most Viewed