కూటమి మేనిఫెస్టో రెడీ.. చంద్రబాబు సంచలన హామీలు

by Disha Web Desk 16 |
కూటమి మేనిఫెస్టో రెడీ.. చంద్రబాబు సంచలన హామీలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈమేరకు అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. అన్ని పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే మేనిఫెస్టోలపై కసరత్తులు ప్రారంభించాయి. మరోవైపు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. దీంతో కూటమి తరపున ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీలు రెడీ చేస్తున్నాయి. మరో వారంలో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం టీడీపీ మేనిఫెస్టోను రెడీ చేశారు. అయితే బీజేపీ, జనసేన నుంచి ప్రతిపాదనలు రావడంతో ఆయా అంశాలపై పరిశీలన చేశారు. ఈ మేరకు ఉమ్మడి మేనిఫెస్టోను కూటమి నేతలు ప్రకటించనున్నారు.

దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన హామీలు ప్రకటించారు. కాకినాడలో ప్రజాగళం సభలో పాల్గొన్న ఆయన తల్లికి వందన పథకం కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు అందిస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఫ్రీగా పంపిణీ చేస్తామన్నారు. రైతులకు ప్రతి సంవత్సరం రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. టిడ్‌కో ఇళ్లు ఉచితంగా అందజేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. పింఛన్లు ఇంటి వద్దకే వచ్చి రూ.4 వేలు అమలు చేస్తామన్నారు. పేదలకు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు. మంచి వ్యక్తులను ఆదరిస్తే ప్రజలు బాగుంటారని చంద్రబాబు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఎత్తిపోతల పథకాలను బాగు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. యువత భవిష్యత్తు బాగుండాలంటే కూటమి అధికారంలోకి చంద్రబాబు పేర్కొన్నారు.



Next Story