తెలుగు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ.. దీపావళి తర్వాతే సుప్రీం తీర్పు

by Disha Web Desk 2 |
తెలుగు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ.. దీపావళి తర్వాతే సుప్రీం తీర్పు
X

దిశ, ఏపీ బ్యూరో: ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు దీపావళి సెలవుల అనంతరం ఇస్తామని సుప్రీంకోర్టు సూచనప్రాయంగా వెల్లడించింది. ఫైబర్​నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. అనారోగ్య కారణాలతో స్కిల్​కేసులో ముందస్తు బెయిల్‌పై ఉన్న చంద్రబాబును నవంబరు 30 వరకు అరెస్టు చేయొద్దని సీఐడీని ఆదేశించింది.

ఈలోగా క్వాష్‌పై సుప్రీంకోర్టు తీర్పు రావొచ్చు. చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ వర్తిస్తుందని న్యాయస్థానం చెబితే పలు కేసులతోపాటు ఫైబర్ నెట్ కేసు కూడా రద్దవుతుంది. ఒకవేళ చంద్రబాబుకు వర్తించదని తీర్పు వస్తే తదుపరి చంద్రబాబు సీజేఐ బెంచ్‌కు వెళ్లొచ్చు. ఈ కేసులన్నింటిలో బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. మొత్తంగా స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టు వెల్లడించబోయే తీర్పు దేశవ్యాప్తంగా చారిత్రాత్మకమవుతుందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.



Next Story

Most Viewed