కాసేపట్లో వైఎస్ వివేకా మర్డర్‌పై సునీతా రెడ్డి సంచలన ప్రెస్ మీట్

by Disha Web Desk 4 |
కాసేపట్లో వైఎస్ వివేకా మర్డర్‌పై సునీతా రెడ్డి సంచలన ప్రెస్ మీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసుకు సంబంధించిన కుట్రపై కాసేపట్లో ఆయన కూతురు సునీతా రెడ్డి సంచలన ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సునీతా రెడ్డి ప్రెస్ మీట్ ఉండనుంది. అయితే వివేకా మర్డర్ కేసులో సునీతా రెడ్డి ఎవరి పేరు బయట పెడతారు.. ఏ విషయాలు చెప్పబోతున్నారనేది ఏపీ పాలిటిక్స్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక, వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయం చేయాలని సునీతారెడ్డి మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు. ఐదేళ్లుగా న్యాయం చేయాలని కోరుతున్నారు. తాజాగా ఢిల్లీలో ప్రెస్ మీట్‌లో తన తండ్రి హత్యకు కుట్ర చేసిందెవరు అనే విషయంపై ఆమె మాట్లాడనున్నారు. దీంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను ఆమె బయట పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More: వైఎస్ వివేకా మర్డర్‌.. CM జగన్‌పై సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు


Next Story

Most Viewed