బుద్ధవనం మ్యూజియంకు ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ ఎండీ

by Disha Web Desk 13 |
బుద్ధవనం మ్యూజియంకు ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ ఎండీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాచర్ల నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గల చారిత్రాత్మక కట్టడం బుద్ధవనంకు ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ప్రకటించారు. గురువారం పల్నాడు జిల్లాలోని మాచర్ల, పిడుగురాళ్ల డిపోలు, బస్ స్టేషన్లను పరిశీలించారు. అనంతరం బుద్ధవనంను సందర్శించారు. అనంతరం ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ.. యాత్రికులు చూడదగ్గ ప్రదేశంగా, ఎంతో అందంగా బుద్ధవనం ప్రాజెక్ట్ అందర్నీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దబడింది అని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు..యాత్రికులు ఎండీ ద్వారకా తిరుమల రావును కలిసి విజయవాడ, గుంటూరు తదితర ప్రదేశాల నుండి బుద్ధవనంకు బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ బుద్ధవనంకి దగ్గరలో కేవలం 9 కిలోమీటర్ల దూరంలో నాగార్జున సాగర్, నాగార్జున కొండ కూడా ఉన్నాయని కాబట్టి పర్యాటకులకు కనువిందు చేసేలా ఉండే ఈ ప్రాంతాలకు బస్సు ఏర్పాటు చేయడం వలన ఆర్టీసీ అదనపు ఆదాయం పెంచుకునే అవకాశం కూడా ఉందని వారు తెలిపారు. వారి అభ్యర్ధన మేరకు బస్సు సౌకర్యం కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు.

Also Read..

ఎమ్మెల్సీ ఎన్నికల రీజినల్ కార్యాలయాన్ని ప్రారంభించిన వైవీ సుబ్బారెడ్డి



Next Story

Most Viewed