హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్నారా..?.. ఆ రైల్లో వెళ్తే సాఫీగా జర్నీ

by Disha Web Desk 16 |
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్నారా..?.. ఆ రైల్లో వెళ్తే సాఫీగా జర్నీ
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. సురక్షితమైన జర్నీ కోసం మెరుగైన సేవలందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన బోగీలతో నడిచే గౌతమి ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 2న ప్రారంభమైన ఈ రైలు కాకినాడ-లింగంపల్లి మధ్య రాకపోకలు సాగిస్తోంది. ఈ రైలుకు ఎల్‌హెచ్ బీ బోగీలను అనుసంధానం చేశారు. మొత్తం 24 బోగీల్లో 22 బోగీల్లో ఈ సిస్టమ్ పని చేస్తోంది. దీని వల్ల ప్రయాణంలో ఎటువంటి కుదుపులు, సౌండ్స్ డిస్టబెన్స్ లేదని ప్రయాణికులు చెబుతున్నారు. డబుల్ సస్పెన్షన్, డిస్క్, బ్రేకింగ్ సిస్టమ్‌తో ఈ బోగీల్లో ప్రయాణం బాగుందని అంటున్నారు. రైల్వే శాఖకు ధన్యవాదాలు చెబుతున్నారు.


కాగా ఈ ఆధునిక బోగీలతో ఏర్పాటు చేసిన కొన్ని రైళ్లను గత జులైలోనే రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. లింకె హాఫ్ మన్ బచ్చ్ బోగీలతో ఏర్పాటు చేసిన మరిన్ని రైళ్లను వివిధ రాష్ట్రాల్లోనూ వినియోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణను అనుసంధానం చేసేలా గౌతమి ఎక్స్ ప్రెస్‌ను కాకినాడ-లింగంపల్లి- కాకినాడ మధ్య ప్రయాణాలకు ఏర్పాటు చేసింది.

Next Story

Most Viewed