రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. విజయనగరం ట్రైన్ యాక్సిడెంట్‌తో ఆ రైళ్లన్నీ దారి మళ్లింపు

by Disha Web Desk 19 |
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. విజయనగరం ట్రైన్ యాక్సిడెంట్‌తో ఆ రైళ్లన్నీ దారి మళ్లింపు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పలాస ప్యాసింజర్, విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రైన్ బోగీలు చెల్లాచెదురుగా పడటంతో ట్రాక్ దెబ్బతింది. రంగంలోకి దిగిన రెస్య్కూ టీమ్‌లు ట్రాక్‌కు మరమ్మత్తులు చేస్తున్నాయి. అయితే, ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి కాకపోవడంతో సోమవారం పలు రైళ్లను అధికారులు దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.

విజయనగరం రైలు ప్రమాదం నేపథ్యంలో.. చెన్నె-సంత్రగచి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, త్రివేండ్రం-షాలిమార్ ఎక్స్‌ప్రెస్, అగర్తాల-బెంగళూరు ఎక్స్‌ప్రెస్, షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, సంత్రగచి-తిరుపతి ఎక్స్‌ప్రెస్, షాలిమార్- చెన్నె కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, చెన్నె-షాలిమార్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, ధన్‌బాద్-అలెప్పీ బొకారో ఎక్స్‌ప్రెస్, హతియా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్, మంగళూరు-సంత్రగచి ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హావ్‌డా దురుంతో ఎక్స్‌ప్రెస్, తిరుపతి-హావ్‌డా ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్- హావ్‌డా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, బెంగళూర్-హావ్‌డా ఎక్స్‌ప్రెస్, బెంగళూరు- జశిద్ది ఎక్స్‌ప్రెస్, కన్యాకుమారి-హావ్‌డా ఎక్స్‌ప్రెస్, చెన్నె- హావ్‌డా మెయిల్, వాస్కోడిగామా-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ వయా ఖరగ్‌పూర్ మీదుగా విజయవాడకు దారి మళ్లించినట్లు అధికారులు ప్రకటించారు. పలు రైళ్లను రద్దు సైతం చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.

Next Story

Most Viewed