Ration Card: తెల్ల రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం బంపర్ న్యూస్.. సమ్మర్ స్పెషల్ అండీ!

by Disha Web Desk 1 |
Ration Card: తెల్ల రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం బంపర్ న్యూస్.. సమ్మర్ స్పెషల్ అండీ!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నిలకు సమీపిస్తున్న వేళ తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారికి జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి ఒక్కరికి పౌష్టికాహారాన్ని అందించేందుకు సర్కార్ నడుం బిగించింది. ఈ మేరకు రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డు మీద మార్చి 1నుంచి రాగి పిండిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రాగి పిండి కేజీ రూ.40 ఉండగా.. ప్రజల స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కేవలం రూ.11లకే కిలో రాగి పిండిని అందజేయనుంది.

ముందుగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కిలో ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ముందుగా రేషన్‌పై రాగి పిండిని వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. ఆ తరువాత రాయలసీమలోని కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రాగి పిండి పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More..

Breaking: నేడు టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ భేటీ.. అందుకోసమేన..?

Next Story

Most Viewed