Breaking: నేడు టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ భేటీ.. అందుకోసమేన..?

by Indraja |
Breaking: నేడు టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ భేటీ.. అందుకోసమేన..?
X

దిశ డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ , జనసేన పార్టీ సమన్వయ కమిటీ నేడు విజయవాడలో భేటీ కానుంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణ గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారని సమాచారం. అలానే ఉమ్మడి మానిఫెస్ట్ రూపకల్పన.. ఎన్నికల ప్రచారంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అమాశాలపై టీడీపీ, జనసేన నేతలు చర్చించనున్నారు. ఇక ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరినప్పటికీ సీట్ల కేటాయింపు విషయం లో ఇప్పటికి ఓ తాటి పైకి రాలేదు ఇరుపార్టీలు.

పొత్తు కొనసాగిస్తామని ఇరు పార్టీల అధినేతలు చెప్తున్నారు. కానీ ప్రజాక్షేత్రంలో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. ఏ నియోజకవర్గం నుండి ఎవరు పోటీ చేస్తారు అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో ఇరుపార్టీల కార్యకర్తల్లో, నేతల్లో గందరగోళం నెలకొంది. ఇక ఈ నేపథ్యంలో నేడు జరగనున్న సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు అనే అంశం ఉత్కంఠ భరితంగా మారింది.

కాగా ఈ సమావేశానికి టీడీపీ నుండి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య హాజరు కానున్నారు. అలానే జనసేన నుండి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్, గోవిందరావు, యశస్విని హాజరు కానున్నారు. మరి ఈ రోజైన సీట్ల కేటాయింపు పై తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారా..? లేదా అనేది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read More..

సురేంద్రబాబుకే కళ్యాణదుర్గం టీడీపీ టికెట్..?

Advertisement

Next Story