రాజమండ్రి సెంట్రల్ జైల్లో సైకో చంద్రబాబు : మంత్రి జోగి రమేశ్

by Disha Web Desk 21 |
Jogi Ramesh
X

దిశ, డైనమిక్ బ్యూరో : అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు అదే తంతు జరిగింది. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. చంద్రబాబుపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్ద సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.'సైకో పాలన పోవాలి-సైకిల్ పాలన రావాలి' అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డుల ప్రదర్శనలు చేశారు. సభలో టీడీపీ సభ్యుల ఆందోళనలపై మంత్రి జోగి రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును విడుదల చేయాలని కోరాల్సింది శాసనసభను కాదు కోర్టులను అని సూచించారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డులు స్పీకర్ పోడియం వద్ద కాకుండా కోర్టు వద్ద ప్రదర్శించాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమితోనే సైకో పాలన పోయిందని... ఇప్పుడు ఉన్నది కేవలం సుపరిపాలన మాత్రమేనని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సైకో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖైదీ నెంబర్ 7691 చంద్రబాబు బొక్కలో ఉన్నారంటూ మంత్రి జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed