జనంతో మమేకం.. అదే ఆనందం అంటున్న కలెక్టర్ దంపతులు

by Disha Web Desk 16 |
జనంతో మమేకం.. అదే ఆనందం అంటున్న కలెక్టర్ దంపతులు
X

దిశ, దక్షిణ కోస్తా: ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్ల ఆలోచనా తీరే వినూత్నంగా ఉంటుంది. ఇద్దరూ భార్యాభర్తలు. రోజువారీ పనులతో ఎంత బిజీగా ఉంటారు. అప్పుడప్పుడూ ఆట విడుపుగా సెలవు రోజుల్లో సామాన్య ప్రజలతో మమేకమవుతుంటారు. అలాగే ఆదివారం ఇద్దరు కలెక్టర్లు ఏ ఎస్ దినేష్ కుమార్​, విజయకృష్ణ పిల్లలతో కలిసి ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండల కేంద్రంలో కొద్దిసేపు ఆగారు. పొగాకు బ్యారన్ల దగ్గరకు వెళ్లారు. రైతులతో ముచ్చటించారు. అకాల వర్షాల వల్ల పొగాకు దిగుబడి తగ్గుతుందని రైతులు చెప్పారు. మైసూరులో కిలో రూ.260 పలుకుతోందని, ఇక్కడ కనీసం సగటున రూ. 240 వస్తుందని ఆశిస్తున్నట్లు రైతులు వివరించారు.

ఈఏడాది అకాల వర్షాల వల్ల దిగుబడులు తగ్గినా ధరలు బాగానే ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మిర్చి పంట సాగు గురించి కలెక్టర్ల దంపతులు రైతులను అడిగి తెలుసుకున్నారు. తామర పురుగు వల్ల దిగుబడులు తగ్గే అవకాశం ఉందని రైతులు వెల్లడించారు. ఎకరానికి పది నుంచి పన్నెంటు క్వింటాళ్ల దిగుబడి వస్తే పెట్టుబడులు వస్తాయని కలెక్టర్లకు వివరించారు. రెండు జిల్లాల కలెక్టర్లు తమ ఇబ్బందులు తెలుసుకోవడానికి వచ్చినందుకు రైతులు ధన్యవాదాలు తెలిపారు.


Next Story

Most Viewed