- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ongole: చంద్రబాబుపై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబుపై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పేదలకు పట్టాలు పంపిణీ చేసిన ఆయన వందమంది సినిమా విలన్న కన్నా చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే చంద్రబాబు టార్గెట్ అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో లేని వ్యక్తులే చంద్రబాబును వెనకేసుకొస్తారని సీఎం జగన్ ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా 1191 కేసులు వేశారని ఆయన ఆక్షేపించారు. చంద్రబాబు కుట్రలను పటాపంచలు చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు హయాంలో పేదలకు ఒక్క సెంటు కూడా స్థలం ఇవ్వలేదని విమర్శించారు. రూ. 231 కోట్ల విలువైన భూమిని ఒంగోలులో అక్క చెల్లెమ్మలకు ఇచ్చామని తెలిపారు. మొత్తం 21 వేల ఇళ్ల పట్టాలు పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. మనం సిద్ధం అంటుంటే. .చంద్రబాబు కుప్పం నుంచే బైబై అంటున్నారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు.