రేపు ఒంగోలులో బృహత్తర కార్యక్రమం

by Disha Web Desk 16 |
రేపు ఒంగోలులో బృహత్తర కార్యక్రమం
X

దిశ, వెబ్ డెస్క్: ఒంగోలులో శుక్రవారం బృహత్తర ఘట్టం ప్రారంభంకానుంది. 20 వేల 840 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. సర్వ హక్కులతో రిజిస్టర్ చేసి ఇంటి స్థలంతో పాటు కట్టుకోవడానికి అన్ని అనుమతులు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలినేని మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సమేతంగా వచ్చి పట్టాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఒంగోలులో గుడిసెలు ఉండొద్దనే పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఇళ్లు కూడా కట్టిస్తామని చెప్పారు. అన్నీ పరిశీలించిన తర్వాతే లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారని తెలిపారు.


Next Story

Most Viewed