చంద్రబాబుకు మద్దతు : రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఉత్తరాల వెల్లువ

by Seetharam |
చంద్రబాబుకు మద్దతు : రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఉత్తరాల  వెల్లువ
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అన్ని వర్గాల నుంచి కు అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. టీడీపీ నేతలతోపాటు వామపక్ష, జనసేన పార్టీలతోపాటు సెలబ్రిటీలు, ప్రముఖులు తమ మద్దతు తెలియజేస్తున్నారు. అంతేకాదు ఇతర రాష్ట్రాలోని తెలుగు ప్రజలు సంఘీభాం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు సైతం మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమని ఆరోపిస్తున్నారు. తాజాగా బాబుతోనేను పేరుతో చంద్రబాబుకు మద్దతుగా అనేక మంది లేఖలు రాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16 నుంచి పోస్టుకార్డుల ఉద్యమం మొదలుకాగా.. ఈ నెల 20న రాజమండ్రి జైలుకు 2,150 ఉత్తరాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ నెల 21న 6,250, 22న 8,340 కార్డులు, 23న 23,570 పోస్టుకార్డులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వచ్చినట్లు తెలుస్తోంది. వీటికి అదనంగా స్పీడ్ పోస్టులో 60 ఉత్తరాలు, రిజిస్టర్డ్ పోస్టులో 90 ఉత్తరాలు, ఆర్డినరీ పోస్టులో 300 ఉత్తరాలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరినట్లు జైలు అధికారులు వెల్లడించినట్లు తెెలుస్తోంది.

Next Story