Galla Jayadev : వ్యాపార వేత్తలపై రాజకీయ వేదింపులు సరికాదు..రీ ఎంట్రీ అప్పుడే

by Disha Web Desk 5 |
Galla Jayadev : వ్యాపార వేత్తలపై రాజకీయ వేదింపులు సరికాదు..రీ ఎంట్రీ అప్పుడే
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొద్ది రోజుల క్రితం సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నట్లు ప్రకటించిన గల్లా జయదేవ్ పార్లమెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో మాట్లాడిన ఆయన.. రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నట్లు చెప్పారు. అమరావతి రైతులకు ఎప్పటికీ తన మద్దతు ఉంటుందన్నారు. అలాగే తనకు ఎంపీగా అవకాశం ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకి, గుంటూరు ప్రజలకి ధన్యవాదాలు తెలిపారు. నా నియోజకవర్గ అభివృద్దికి, అమరావతిని స్మార్ట్ సిటీగా నిలిపేందుకు కృషి చేశానని, ఈ సభలో ఎందరో పెద్దలు నాకు మార్గదర్శకంగా నిలిచారని అన్నారు. రాబోయే ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని, ఏపీలో దొంగ ఓట్లపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని, నిష్పాక్షిగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు.

అంతేగాక ప్రజాస్వామ్యంలో వ్యాపారులది కీలక పాత్ర అని, వారిలో ఎంతో మంది చట్టసభలకు ఎన్నిక అవుతున్నారని, అలాంటి వ్యాపార వేత్తలపై రాజకీయ వేదింపులను నివారించాలన్నారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా జయదేవ్ కూడా సీఎం జగన్ వల్ల, వైసీపీ నాయకుల వల్ల వేదింపులకు గురయ్యారా అనే ప్రశ్న తలెత్తుంది. ఈ వేదింపుల కారణంగానే అమర్ రాజా కంపెనీని ఏపీ నుంచి తెలంగాణకు షిఫ్ట్ చేశారా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. జే-ట్యాక్స్ కట్టలేకనే కంపెనీని షిఫ్ట్ చేశారా..? లేక పార్టీ మారాలని వచ్చిన ఒత్తిడిలకు తలొగ్గలేక రాజకీయాలకే విరామం ప్రకటించారా అనే ప్రశ్నలు చర్చలకు దారి తీస్తున్నాయి.

దీంతోపాటు రాష్ట్రం, దేశాభివృద్దిలో నా వంతు పాత్ర పోషిస్తూనే ఉంటానని, రాముడు 14 ఏళ్లు వనవాసం చేసినట్లు, నేను కూడా విరామం తీసుకుంటున్నాని తెలిపారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ వస్తానని స్పష్టం చేశారు. జయదేవ్ మాటలని బట్టి రీఎంట్రీ త్వరలోనే ఉంటుందని.. రాష్ట్రంలో వైసీపీ పాలన పోయి, టీడీపీ- జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చిన అనంతరం రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుందని, దానికి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read More..

AP అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ స్పీచ్‌లో ఇవే హైలెట్స్

Next Story