అక్కడ ప్రజలు జాగ్రత్త.. 4 మండలాలకు రెడ్‌అలర్ట్

by Disha Web Desk 7 |
అక్కడ ప్రజలు జాగ్రత్త.. 4 మండలాలకు రెడ్‌అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఎండలు అధికంగా నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటేనే భయంతో వణుకుతున్నారు. అయితే.. రాష్ట్రంలో ఇవాళ 126 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి జిల్లా కూనవరం, అనకాపల్లి జిల్లా గొలుగొండ, నాతవరం మండలాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు 4 మండలాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతే కాకుండా.. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని.. ముఖ్యంగా ఉ. 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రాకుండా ఉంటడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story

Most Viewed