జగన్ది పేదల ప్రభుత్వం.. ఎమ్మెల్యే బాలినేని

by Dishafeatures2 |
జగన్ది పేదల ప్రభుత్వం.. ఎమ్మెల్యే బాలినేని
X

దిశ, ఒంగోలు: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి పేదలను అక్కున చేర్చుకున్నారని, ఒక్కమాట లో చెప్పాలంటే ఇది పేదల ప్రభుత్వం అని ఒంగోలు ప్రజల ఋణం తీర్చుకుంటానని మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఒంగోలులో నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే బాలినేని అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు ఎంపీ బీద మస్తానరావు, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బాలినేని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ఒంగోలు తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కొరకు రూ.339 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. దశాబ్దాలుగా నెలకొని ఉన్న సమస్యను పరిష్కరించి ఒంగోలు దాహార్తిని ముఖ్యమంత్రి తీర్చారని కొనియాడారు. అదేవిధంగా తనను 5సార్లు గెలిపించిన ఒంగోలు నియోజకవర్గ ప్రజల ఋణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు.

ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్తారని, అందుకే గత ఎన్నికల్లో బాబుకు ప్రజలు తగిన బుద్ది చెప్పారని గుర్తు చేశారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇచ్చిన మాట తప్పరని, పాదయాత్రలో నాడు ఇచ్చిన హామీలు అధికారం లోకి రాగానే నెరవేర్చారని పేర్కొన్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్న పేదల కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చారని తెలిపారు. గతంలో చంద్రబాబు కుడా అప్పులు చేసి వాళ్ల జేబులు నింపుకున్నారని బాలినేని ధ్వజం ఎత్తారు. కానీ సీఎం జగన్ మాత్రం పేదల కష్టాలు తీరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. గృహసారథులను నియమించి పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారని తెలిపారు. నాయకులు కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో అందరం కలసి పార్టీని మరలా అధికారంలోకి తీసుకొచ్చి జగన్మోహరెడ్డిని సీఎం చేసి సంక్షేమ ప్రభుత్వాని ఏర్పాటు చేద్దామని బాలినేని పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed