నామినేషన్ల మహోత్సవమా లేక రణరంగమా..?ర్యాలీలో పోటీపడ్డ సైకిల్, ఫ్యాన్ పార్టీలు!

by Disha Web Desk 18 |
నామినేషన్ల మహోత్సవమా లేక రణరంగమా..?ర్యాలీలో పోటీపడ్డ సైకిల్, ఫ్యాన్ పార్టీలు!
X

దిశ,చంద్రగిరి: సార్వత్రిక ఎన్నికలు 2024 కి ఏప్రిల్ 25వ తేదీ నామినేషన్లకు ఆఖరి రోజు కావడంతో ప్రధాన పార్టీల సభ్యులందరూ నామినేషన్లు వేయడానికి పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గానికి టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులైన పులివర్తి నాని, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సైతం ఈ రోజున నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ వారు ఈ నామినేషన్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక మహోత్సవం లాగా నిర్వహించారు. వారి ఇష్ట దైవాలను కులదైవాలను ప్రార్థించి నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.

టీడీపీ అభ్యర్థి అయిన పులివర్తి నానితో పాటుగా చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే వైసీపీ అభ్యర్థి అయిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంత్రివర్యులు రోజా, చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ర్యాలీ లో పాల్గొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా నామినేషన్ దాఖలు చేసే ఆర్డీవో కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య మాటల యుద్ధంతో పాటుగా ఒకరిపై ఒకరు రాళ్ల దాడి కూడా చేసుకున్నారు.

ఇంత హై టెన్షన్ ఏర్పడడంతో మహోత్సవం కాస్త రణరంగంగా మారిపోయింది. ఒకానొక సందర్భంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఆర్డీవో కార్యాలయం నుంచి బయటకు వస్తుంటే టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు కారును తప్పించడానికి నానా ఇబ్బందులు పడ్డారు. ప్రజాస్వామిక దేశంలో ఒక నామినేషన్ ప్రక్రియను రణరంగంగా మార్చడంతో మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇరు పార్టీ సంబంధించిన నేతలు వారు కవ్వించారని ఒకరిపై ఒకరు నిందలు మోపుకున్నారు. ఏది ఏమి అయినప్పటికీ ఒక మహోత్సవంలో జరగాల్సిన కార్యక్రమాన్ని రణరంగంగా ఇరు పార్టీలు మార్చి వేశాయి.



Next Story

Most Viewed