ఎన్డీఏ, ఇండియా కూటములకు సమదూరంలోనే ఉన్నాం: అమిత్ షాతో నారా లోకేశ్

by Disha Web Desk 21 |
ఎన్డీఏ, ఇండియా కూటములకు సమదూరంలోనే ఉన్నాం: అమిత్ షాతో నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నట్లు ఫిర్యాదు చేశారు.చంద్రబాబు భద్రత పరంగా ఉన్న ఆందోళన గురించి వివరించారు. ఈ సందర్భంగా లోకేశ్‌కు పలు ప్రశ్నలు వేశారు. సీఐడీ ఎందుకు పిలిచింది.. ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడిగారు అని లోకేశ్ వెల్లడించారు. పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసులే అని అమిత్ షాకు వివరించినట్లు తెలిపారు. బీజేపీ పేరు చెప్పి కక్ష సాధిస్తున్నారని అమిత్ షా అన్నారన్నారు. అమిత్ షా వద్ద ఎలాంటి రాజకీయ విషయాలు చర్చకు రాలేదు అని లోకేశ్ స్పష్టం చేశారు. బీజేపీనే చేయిస్తోందని ఒక ఎంపీ, మంత్రి నేరుగా అన్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.బీజేపీ పాత్ర ఉందని తాను అనుకోవట్లేదు అని చెప్పుకొచ్చారు. కేంద్రహోంమంత్రి అమిత్ షా కలవాలనుకుంటున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసినట్లు నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.

నిజంవైపు ఉండండి

‘టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో పెట్టడం, తమపై కేసులు పెట్టడం వెనుక బీజేపీ హస్తం ఉందనే ప్రచారం ఉంది. బీజేపీ నేతల మౌనంతో ఆరోపణలు వచ్చాయనుకుంటున్నా. నిజం వైపు ఉండండి’అమిత్ షాను కోరినట్లు లోకేశ్ వెల్లడించారు. రాష్ట్రంలో పరిణామాలపై టీడీపీ ఎంపీలు ప్రధాని, హోంమంత్రికి లేఖలు రాశారు. రాష్ట్రం నుంచి అమిత్ షా సమాచారం తీసుకున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అక్రమ కేసుపై వైసీపీ క్యాడర్‌లోనే అనుమానం ఉంది. 10 రోజులుగా కేసు విషయమై వైసీపీ మాట్లాడట్లేదు. స్కిల్ కేసు వెనుక ఏదో జరుగుతోంది. నా తల్లి ఐటీ రిటర్న్‌లు సీఐడీ చేతికి ఎలా వచ్చాయి? నా తల్లి ఐటీ రిటర్న్‌లపై సీబీడీటీకి ఫిర్యాదు చేస్తా’ అని నారా లోకేశ్ అమిత్ షాతో అన్నారు. ఎన్డీఏ, ఇండియా కూటములకు సమదూరంలోనే ఉన్నాం. దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను కలిశా. మేం సుప్రీంలో సవాల్ చేసిన 17ఏ అంశం చాలా కీలకం. 17ఏ పరిగణనలోకి తీసుకోకుంటే చాలామంది ఇబ్బంది పడతారు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed