ఇది మాన‌వ‌త్వమేనా?... Cm Jagan కు Nara Lokesh లేఖ

by Disha Web Desk 16 |
ఇది మాన‌వ‌త్వమేనా?... Cm Jagan కు Nara Lokesh లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: అడ్డగోలు నిబంధ‌న‌లు, అబ‌ద్ధపు నోటీసుల‌తో పింఛ‌న్ల తొల‌గింపు ఆపాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో అధికారం కోసం పింఛ‌న్ల పెంపుపై ఆశ చూపి నేడు తొలగించేందుకు కుట్ర పన్నుతారా? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం రూ.200 ఉన్న పింఛ‌నుని ప‌దిరెట్లు పెంచి రూ.2000 చేస్తే.. వైసీపీ ప్రభుత్వం రూ.3000 చేస్తామ‌ని హామీ ఇచ్చి మోస‌ంచేసిందని లోకేశ్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంట‌నే వయోపరిమితి నిబంధ‌న‌ల‌తో సుమారు 18.75 లక్షల పెన్షన్లను రద్దు చేశారని ఆరోపించారు. తాజాగా మ‌రోసారి పింఛ‌న్ న‌య‌వంచ‌న‌కి దిగ‌డం న్యాయ‌మనిపిస్తుందా? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఓ లేఖ రాశారు. 'పెంచాల్సిన పింఛ‌న్ సొమ్ము పెంచ‌లేదు, ఏళ్లుగా వ‌స్తున్న పింఛ‌న్లనే ర‌ద్దు చేసేందుకు అడ్డగోలు నిబంధ‌న‌లతో నోటీసులు ఇస్తారా?. రాష్ట్ర వ్యాప్తంగా 6 ల‌క్షల మంది పింఛ‌న్లను ర‌ద్దు చేయాల‌నుకోవ‌డం దుర్మార్గం. 20 ఏళ్ల నుంచి పెన్షన్లు పొందుతున్న అవ్వాతాత‌లు, దివ్యాంగులు, వితంతువులు త‌మ ఆస‌రా తొల‌గించి ఉసురు తీయొద్దని వేడుకోవ‌డం మీకు వినిపించ‌డం లేదా.?. అని సీఎం జగన్ అని లోకేశ్ ప్రశ్నించారు.

అబద్దపు కారణాలతో పింఛన్లు రద్దు చేస్తున్నారంటూ లోకేశ్ మండిపడ్డారు. పెన్షన్ తీసేశార‌నే ఆందోళ‌న‌తో చిత్తూరు జిల్లాకి చెందిన శెట్టియార్ గుండెపోటుతో మృతి చెందారని లేఖలో ప్రస్తావించారు. పోయిన ప్రాణం తీసుకురాగ‌ల‌రా? అని ప్రశ్నించారు. కాకినాడ‌కి చెందిన శ్రీను సొంత స్థలంలో ఇల్లు క‌ట్టుకున్నాడ‌నే ఒకే ఒక కార‌ణంతో ప‌దేళ్ల నుంచి దివ్యాంగులైన పిల్లల‌కు ఇస్తున్న పింఛ‌ను నిలిపేయ‌డం మాన‌వ‌త్వమేనా సీఎం జగన్ అని లోకేశ్ ప్రశ్నించారు. పింఛ‌ను తీసేయ‌డానికి చూపిస్తున్న భూములు, భ‌వ‌నాలు, ఆస్తుల‌న్నీ ఆయా ల‌బ్దిదారుల‌కు అంద‌జేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఏళ్లుగా పింఛ‌న్లు పొందుతున్న దివ్యాంగులు, వితంతువులకు ఇప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని కోర‌డం విడ్డూర‌ం కాకపోతే ఇంకేంటని లోకేశ్ ఎద్దేవా చేశారు. స‌ద‌రం ప‌త్రాలు జారీ నిలిపేసి, దివ్యాంగులు ఆ ప‌త్రాలు తేవాల‌ని నిబంధ‌న పెట్టడం పింఛ‌న్లకి కోత వేయ‌డానికేన‌ని స్పష్టం అవుతోందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.

''నిరుపేద‌ల‌కు లేని కారు, పొలం, ఇల్లు, ఆస్తులు ఎలా సృష్టిస్తున్నారో అర్థంకావ‌డం లేదు. కుటుంబంలో ఎవ‌రో ఒక‌రు ఇన్‌కంట్యాక్స్ క‌డుతున్నార‌ని, 300 యూనిట్ల విద్యుత్ వాడార‌ని నిరాశ్రయులైన వారి పింఛ‌న్లు తొల‌గించ‌డం దారుణం. మాన‌వ‌త్వంతో ఆలోచించండి. అవ్వాతాత‌ల జీవితాల‌కు వెలుగునిచ్చే చిరుదీపాన్ని ఆర్పే ప్రయ‌త్నం చేయొద్దు. దివ్యాంగుల‌కు ఆస‌రాగా నిలిచిన పింఛ‌నుని లాక్కోవ‌ద్దు. వితంతువుల జీవ‌నానికి చేదోడు అయిన పెన్షన్ కోతతో వారికి గుండెకోత మిగ‌ల్చవ‌ద్దు. ఆపండి నోటీసులు. వెన‌క్కి తీసుకోండి దిక్కుమాలిన నిబంధ‌న‌లు. పెన్షన్ల ర‌ద్దుని ఆపండి. ఇది వ‌ర‌కే ర‌ద్దు చేసిన పింఛ‌న్లను పున‌రుద్ధరించండి'. అని లోకేశ్ హితవు పలికారు.

Also Read..

Pawan Kalyan అంత పెద్ద మగాడా: Minister Ambati Rambabu ఫైర్



Next Story

Most Viewed